calender_icon.png 1 January, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే ప్రభుత్వానికి విద్యార్థుల సెగ ఏంటో చూపిస్తాం

29-12-2024 10:58:30 PM

ముషీరాబాద్ (విజయక్రాంతి): పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ప్రభుత్వానికి విద్యార్థుల సెగ ఏంటో చూపిస్తామని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటి (ఏఐపిఎస్యూ) అధ్యక్షుడు బోడ అనిల్, ప్రధాన కార్యదర్శి మన్నె కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. 28, 29 రాష్ట్ర కమిటీ సమావేశాలు సంగం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. ఈ సమావేశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలపై, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, నూతన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం గురించి పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని అన్నారు.

పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ 8200 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలని, అదే విధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ భవనాలు, స్థానికంగా అనేక సమస్యలతో సంక్షేమ హాస్టల్లో సతమతమవుతున్నాయని అన్నారు. కామన్ విద్యా విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, కార్పొరేట్ విద్యా సంస్థలలో ఈ మధ్యకాలంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యార్థులపై ఒత్తిడికి గురి చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని అన్నారు. అదే విధంగా ఫిబ్రవరి 25, 26 తేదీలలో రాష్ట్ర మహాసభలను నిర్వహించుకుంటున్నట్లు 28 29 తేదీలలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ రాష్ట్ర మహాసభలకు ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఆర్ ఎస్ పి కేరళ ఎంపీ ఎన్ కే ప్రేమ్ చంద్రన్, ఏ ఐ పి ఎస్ యూ జాతీయ కార్యదర్శి షఫీ ఉల్లా, రాష్ట్ర నాయకత్వం, వివిధ జిల్లాల ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారని అన్నారు.

ఈ రాష్ట్ర మహాసభలలో భవిష్యత్తు ఉద్యమకార్యాచరణను రూపొందించుకునేందుకు నూతన ప్రభుత్వం విద్యారంగం పట్ల వివరిస్తున్న తీరు కేంద్ర ప్రభుత్వ విద్య కాషాయి కరణకు వ్యతిరేకంగా ఈ మహాసభలో నిర్ణయాలు తీసుకునేందుకు ఫిబ్రవరి 25 26 తేదీలలో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ మహాసభలను విద్యార్థులు మేధావులు అందరు కలిసి విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ పి ఎస్ యూ రాష్ట్ర కమిటీ సభ్యులు సాయికుమార్, రాజు, రవి గోపాల్ సింగ్ ఠాకూర్, ఆనంద్ కుమార్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.