calender_icon.png 23 September, 2024 | 5:58 AM

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది

20-09-2024 12:00:00 AM

వారికి సకల సదుపాయాలను కల్పించండి

మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): నెలల తరబడి శ్రమించి ధాన్యం విక్రయించే రైతులకు సకల సదుపాయాలను వ్యవసాయ మార్కెట్ యార్డులో కల్పిం చాల్సిన బాధ్యత నూతన మార్కెట్ కమిటీపై ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్ నూతన పాలక వర్గం ప్రమాణా స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. చైర్‌పర్సన్‌గా బెక్కరి అనిత మధుసూదన్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా పెద్ద విజయ్‌కుమార్‌తోపాటు డైరెక్టర్లు తమ బాధ్యతలను స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతన్న బాగోగులు చూసుకునే అవకాశం కల్పించామని, ప్రతి ఒక్కరికీ మేలు చేసే విధంగా ముందుకు సాగాలని కొత్త పాలకవర్గానికి సూచించారు. బీఆర్‌ఎస్ నేతలు కేవలం రాజకీయం చేసేందుకు విడ్డూరంగా మాట్లాడుతారని, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కోట్లా ది రూపాయులు పార్టీ ఫండ్ బీఆర్‌ఎస్‌కు ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

నిరుపేదలను ఇబ్బందులు పెట్టడం, కక్షసాదింపు చర్యలకు పాల్పడడం వంటి నీతిమాలిన పనులు బీఆర్‌ఎస్ నాయకులకు మాత్రమే సొంతమని ఆరోపించారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని మంత్రి అభినం దించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, యశస్వి, మధుసూదన్‌రెడ్డి, డీసీ సీబీ చైర్మన్ మామిళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్ పాల్గొన్నారు.