గద్వాల (వనపర్తి), నవంబర్ 9 (విజయక్రాంతి):అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. శనివారం ఫ్యాక్టరీ నిర్మించనున్న ప్రదేశాన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యే విజేయుడు సందర్శించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మిస్తే గ్రామాల్లో వాతావరణం దెబ్బతిని ప్రజలు అనారోగ్యానికి గురవుతారని చెప్పా రు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా ఫ్యాక్టరీని నిర్మించాలని తలిస్తే ప్రజా ఉద్యమం తప్పదంటూ సీఎం రేవంత్‌రెడ్డికి ఫ్యాక్స్ పంపినట్టు తెలిపారు. ఎమ్మె ల్యే వెంట పెద్ద ధన్వాడ, చిన్న ధన్వా డ, నసనూర్, మాన్ దొడ్డి గ్రామాల ప్రజలు, రైతులు ఉన్నారు.