17-03-2025 12:34:02 AM
ఏడవ రోజుకు చేరుకున్న నిరసన దీక్ష
భీమదేవరపల్లి మార్చి 16 (విజయ క్రాంతి): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అమలు తర్వాతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఉద్యోగా ఫలితాలు, నియాకాలు నిలుపుదల చెప్పట్టాలని డిమాండ్ తో ఎమ్మా ర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబెడ్కర్ కూ డలి వద్ద నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రేణిగుంట్ల బిక్షపతి మాదిగ ఎమ్మార్పీ హు స్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, మరియు ఇతర ఉద్యోగ నియామకాల పరీక్ష ఫలితాలు విడుదల చేస్తూ మాదిగల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.
ఆగస్టు 1 నాడు అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు వర్గీకరణ ఇచ్చిన తీర్పును ఒకవైపు స్వాగతిస్తునే, వర్గీకరణ చట్టం అమలు తర్వాతే ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేపడుతామని, అలాగే అదే సమయంలో పాత నోటిఫికేషన్లకు ఆర్డినెన్సు తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పి, అదే సమయంలో డాక్టర్ షమిం అక్తర్ ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్ వేసి రిపోర్ట్ తెచ్చుకొని ఇంకా వర్గీకరణ చట్టాన్ని అమలు చెయ్యకుండా ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలు విడుదల చెయ్యడమంటే ఈ రాష్ట్రంలో మా దిగలను లేకుండా చేసే కుట్రలు జరుగుతాయని తెలియచేయడం జరిగింది.
మాదిగ మాదిగ ఉప కులాలు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మాలలకు తొత్తుగా మారి షెడ్యూల్ కులాల వర్గీకరణ చేయడం లేదు కనుక మళ్లీ మాదిగ మాదిగ ఉపకులాలు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు .అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే మాదిగ, మాదిగ ఉప కులాలు రాజకీయంగా పతనం చేస్తారని హెచ్చరించారు. దీక్షలో ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్ల వెంకటస్వామి మా దిగ రేణిగుంట్ల బిక్షపతి, మాదిగ ఎమ్మార్పీఎస్ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు కడా రి ప్రభాస్ ఎమ్మార్పీఎస్ నాయకులు నాగిన్ల శ్రీకాంత్ మాదిగ, నాగిన్ల కుమార్, నాగిన్ల ర జినీకాంత్, తాళ్ల పెళ్లి ఆశీర్వాదం పాల్గొన్నారు.