06-03-2025 12:05:46 AM
బీజేపీ ఎంపీ అర్వింద్
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి వస్తానంటే బీజేపీలోకి ఆహ్వానిస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కా మెంట్ చేశారు. సీఎం పదవి నుంచి తొలగిస్తే అతడు చూస్తూ ఊరుకుంటాడని తాను భావించడం లేదన్నా రు. బీజేపీ అధిష్ఠానం రేవంత్‌ను పార్టీలోకి తీసుకుంటుందా? లేదా? అనేది తన చేతిలో లేదన్నారు.
బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అర్వింద్ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని, ఈ విషయాన్ని బీజేపీ నేతలే తనకు చెప్పారంటూ రేవంత్ అంటున్నారని.. కానీ ఇది శుద్ధ అబద్ధమని తెలిపారు.
రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీకి లోటస్ సిటీ అని పేరు పెడతాడేమోనని.. అందుకే ప్రధాని మోదీని మం చోడని పొగుడుతున్నట్టున్నాడన్నా రు. చెటాక్ మెదడున్నోడెవరైనా మో దీతో మంచిగా ఉంటారని.. ట్రంప్ లాంటి వ్యక్తే మన ప్రధానితో స్నే హంగా ఉంటున్నారని తెలిపారు.