calender_icon.png 7 November, 2024 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణ చేపట్టకపోతే సర్కార్‌తో యుద్ధమే

07-11-2024 12:08:56 AM

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ 

మహేశ్వరం, నవంబర్ 6: ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోతే రేవంత్‌రెడ్డి సర్కార్‌తో యుద్ధం చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలతో మభ్యపెట్టడం కాకుండా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు పర్చాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు బుధవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఓ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెం టనోళ్ల నరసింహ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగల ధర్మయుద్ధ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజ రై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేయకుం డానే రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయడం నమ్మక ద్రోహం అన్నారు.

రేవంత్‌రెడ్డిని నమ్మితే మోసం చేశాడని, ఉపాధ్యా య నియామకాలతో ఈ విషయం తెలిపోయిందని అన్నారు. మాదిగలకు ఉద్యోగాలు దక్కకుండా సర్కార్ కుట్ర చేస్తోం దని ఆరోపించారు. త్వరలోనే రథయా త్రతో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తామని తెలిపారు.

డిసెంబర్ 31న హైదరాబాద్‌లో నిర్వహించబో యే ధర్మయుద్ధ మహా ప్రదర్శన ద్వారా రేవంత్‌రెడ్డి సర్కార్‌తో తాడోపేడో తెల్చు కుంటామని హెచ్చరించారు. సభలో రావుగళ్ల బాబుమాదిగ, రాంచందర్, బైరపొగు శివకుమార్ మాదిగ, పంగ ప్రణయ్ మాదిగ, మల్లికార్జున్, ఆనంద్ మాదిగ, గట్టగల్ల ప్రశాంత్, పోతుగంటి కృష్ణ మాదిగ పాల్గొన్నారు.