calender_icon.png 30 October, 2024 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛాయ్‌ను ఎక్కువ సేపు మరిగిస్తే!

25-06-2024 12:05:00 AM

ఉదయం లేవగానే ఛాయ్ లేకపోతే.. ఆ రోజంతా తలనొప్పిగా ఉంటుంది. అందుకోసమని వేడి వేడిగా ఒక గ్లాస్ ఛాయ్ తాగితే ఉపశమనం కలిగిస్తుంది. రుచి, ఆరోగ్యాన్ని బట్టి.. గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, మిల్క్ టీలను తాగుతుంటారు. వీటిలో మిల్క్ టీ అంటే చాలామందికి ఇష్టం. పాలలో ఎక్కువ టీ ఆకులు వేసి ఎక్కువసేపు మరిగించి తయారు చేసిన టీని ఇష్టపడేవారు కొందరు ఉంటారు. అయితే టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల ఎన్నో హానికర సమ్మేళనాలు జనించే అవకాశం ఉంది. టీని అతిగా మరిగిస్తే అది స్లో పాయిజన్‌గా మారిపోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

ఎంతసేపు మరిగించాలి..

  • టీ రుచిగా, ఆరోగ్యంగా ఉండటానికి 4 నిమిషాలు మాత్రమే మరిగించాలి. ఎక్కువ సేపు మరిగించడం వల్ల కలిగే హానికరంగా మారుతుంది.  

శరీరంలో ఐరన్ లోపం..

  • మిల్క్ టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల అందులోని టానిన్‌ల పరిమాణాన్ని పెంచుతుంది. ఇది పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. దీనితో పాటు.. అధిక టానిన్ కంటెంట్ శరీరంలో ఇనుము లోపానికి కారణమవుతుంది. ఆ కారణంగా రక్తహీనత ఏర్పడుతుంది. 

పీహెచ్ లెవల్‌పై..

  • మిల్క్ టీని ఎక్కువగా మరగబెట్టడం వల్ల దాని పీహెచ్ మారుతుంది. టీ మరింత ఆమ్లంగా మారుతుంది. 

క్యాన్సర్ ప్రమాదం..

  • మిల్క్ టీని అతిగా మరిగించడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే అక్రిలామైడ్ అనే క్యాన్సర్ కారక పదార్థం ఉత్పత్తి అవుతుంది. 

జీర్ణ సమస్యలు..

  • మరిగించిన పాలతో టీ తాగడం వల్ల ఎసిడిటీ, కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. 

రక్తపోటును పెంచుతుంది..

  • మరిగించిన టీని మరింత మరిగించడం వల్ల దానిలో టానిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. రుచి మారుతుంది.. మిల్క్ టీని ఎక్కువగా మరగబెట్టడం వల్ల దాని రుచి మారుతుంది.

పోషకాల నష్టం..

  • మిల్క్ టీని ఎక్కువగా మరిగించడం వల్ల పాలలో ఉండే ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం వంటి అనేక పోషకాలను నాశనం చేస్తుంది.