08-02-2025 01:35:03 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సర్వేనంబర్ 51- 53 వరకు ఉన్న భూముల్లో అక్రమ, అనుమతుల్లేని నిర్మాణాలకు సంబంధించి తాజా నివేదికను సమర్పించాలంటూ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లకు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
గత ఉత్తర్వుల ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చివేయలేదని తేలిన పక్షంలో హైకోర్టు తన విచక్షణాధికారాలను వినియోగించి, కేంద్రానికి ఆదేశాలు ఇవ్వగలదని హెచ్చరించింది. గచ్చిబౌలి పరిధిలోని 42.24 ఎకరాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు నోటీసులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు, తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎం.యా అనే వ్యక్తి గతంలో న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు.
సదరు భూము పలు సంస్థల యాజమాన్యాలు, ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన నిర్మాణాలను చట్టప్రకారం తొలగించాలని 2022 జూలైలో న్యా ఆదేశించింది. అయినప్పటికీ అధికారులు వాటిని అమలు చేయలేదు. దీంతో యాదయ్య హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. యథాతథస్థితి ఉత్తర్వు యు అనుమతుల్లేకుండా, అక్రమ నిర్మాణాలను కొనసాగించేందుకు అనుమతించారని, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జీహెచ్‌ఎంసీ అధికారులు కౌంటర్ దాఖలు చేస్తూ.. ‘సదరు భూముల్లో ఎలాంటి అనుమతుల్లేని నిర్మాణాలను అనుమతించలేదు’ అని నివేదించారన్నారు.
దీంతో తాజా పరిస్థితిపై నివేదిక దాఖలు చేయాలని కోర్టు గతేడాది ఆగస్టు 30న ఆదేశాలిచ్చిందని, కానీ.. నివేదిక ఇవ్వకపోవడంతో జనవరి 10 అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై శుక్రవారం హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్‌అహ్మద్ ఆన్‌లై విచారణకు హాజరయ్యారు. సదరు భూమిలో అక్రమం నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలోగానీ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలోగానీ తన పాత్ర లేదని చెప్పుకొచ్చారు.
దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ ప్రతివాదిగా ఉన్న హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో హాజరుకు ఆదేశించాల్సి వచ్చిందని, తదుపరి హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని తెలిపారు. యథాతథస్థితి ఉత్తర్వులు జారీ చేసినా, సుప్రీం కోర్టు ఉత్తర్వులున్నా అనధికారిక నిర్మాణాలను అధికారులు అనుమతించారని, వాటిని నోటీసులు ఇచ్చి చట్టప్రకారం తొలగించడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఇది జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం విధుల నిర్వహణలో నిర్లక్ష్యమేనని,ఈ నిర్లక్ష్యాన్ని అనుమతించలేమని తేల్చిచెప్పారు. కోర్టును తక్కువగా అంచనా వేయవద్దని, అవసరమైతే తాము కేంద్రానికి ఆదేశాలు జారీ చేయగలమని స్పష్టం చేశారు. ధనవంతులకు ప్రత్యేక చట్టం ఉన్నట్లు అధికారుల వ్యవహరశైలి ఉందని, అదే నిరుపేదలు చిన్నస్థలంలో గుడిసెలు వేసుకుంటే మాత్రం తొలగిస్తారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై వెంటనే తాజా నివేదిక సమర్పించాలని శేరిలింగంపల్లి జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. విచారణను మార్చి 7వ తేదీకి వేశారు.
రాజాసింగ్ పిటిషన్‌పై ఎస్సైకి నోటీసులు
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట 2021 జూన్‌లో తాను ధర్నా నిర్వహిస్తుండగా సైఫాబాద్ ఎస్సై ఎం.తాజంరెడ్డి పెట్టిన కేసును కొట్టివేయాలంటూ గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజా పాటు మరో 20 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్‌తో బీజేపీ నేతలు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారని, కానీ.. నేతలు అక్రమంగా జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి జొరబడ్డారని, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, సాక్షులు కూడా లేరని, అందుకే కేసును కొట్టివేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఫిర్యాదుదారు అయిన నాటి ఎస్సై ఎం.తాజంరెడ్డికి నోటీసులు జారీ చేశారు. విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు.
ఐటీడీఏ అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ములుగు జిల్లా ఏటూరునాగరానికి చెందిన ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి.వీరభద్రంతో పాటు మరో ఇద్దరు అధికారులకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది. మృతిచెందిన ఉద్యోగికి సంబం గ్రాట్యుటీతో పాటు ఇతర పెన్షన్ ప్రయోజనాలను ఆయన కుటుంబ సభ్యులకు చెల్లించాలంటూ గతేడాది ఏప్రిల్‌లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో పిటిషనర్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.మాధవీదేవి విచారణ చేపట్టి కోర్టు ధిక్కరణ కింద అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ప్రతివాదులైన ఐటీడీఏ అధికారులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేశారు.
తీన్మార్ మల్లన్నపై ఎందుకు ఎఫ్‌ఐఆర్ చేయలేదు ?
వివరణ ఇవ్వండి: సిద్దిపేట పోలీసులకు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): తీన్మార్ మల్లన్న అలియాస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌మార్‌పై ఫిర్యాదు అందినా, సిద్దిపేట పోలీసులు ఎందుకు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ సిద్దిపేటకు చెందిన కె.అరవింద్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ కె.శరత్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. వరంగల్‌లో ఈనెల 2న బీసీ సంఘం నిర్వహించిన ఓ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన నవీన్‌కుమార్ ఒక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో శాంతి భంగం కలిగించేవిగా ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలిపారు.పలువురు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ దీంతో తన క్లుంట్ అరవింద్‌రెడ్డి కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. తీన్మార్ మల్లన్నపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదో వివరణ ఇవ్వాలని విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు.