19-03-2025 12:00:00 AM
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా నటించి మెప్పించారు. సాధారణంగా ఏ సినిమా అయినా మంచి హిట్ కొడితే అది హీరోయిన్ కెరీర్‌కు ప్లస్ అవుతుంది. ఈ సినిమా హీరోకు బాగా కలిసొచ్చింది. షాలినీకి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో కెరీర్ పరంగా ఒరిగిందేమీ లేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మను ఈ సినిమాలో చేసిన లాంటి పాత్ర మరోసారి వస్తే అంగీకరిస్తారా? అని ప్రశ్నించగా.. మరోసారి అలాంటి పాత్ర వస్తే నో చెప్పనంటూ చెప్పుకొచ్చింది. వాస్తవానికి అర్జున్‌రెడ్డి చిత్రంలో ఆమె పాత్ర బలహీనంగా ఉందంటూ చాలా కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం డబ్బా కార్టెల్ చిత్రంలో దీనిని బేస్ చేసుకునే ఆమెను.. “డబ్బా కార్టెల్’ సిరీస్‌లో బలమైన మహిళగా కనిపించారు.
ఇప్పుడు మరోసారి ‘అర్జున్‌రెడ్డి’ లాంటి సినిమాను అంగీకరి స్తారా? అని ప్రశ్నించగా.. “నేను కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో నటించిన చిత్రమిది. ఇప్పుడు ఆలోచిస్తే చాలా అమాయకంగా అనిపి స్తూ ఉంటుంది. నా పాత్ర మరింత బలంగా చేసుంటే బాగుండేది అనిపిస్తుంది. మరోసారి అలాంటి పాత్ర వస్తే నో చెప్పను. మరింత అవగాహన పెంచుకుని మరీ నటిస్తా” అని షాలినీ పాండే తెలిపింది.