09-03-2025 12:24:38 AM
ఇండియా టుడే కంక్లేవ్‌లో సూపర్ హిట్ ‘దీవార్’ డైలాగ్ కొట్టిన ఏపీ మంత్రి లోకేశ్
న్యూఢిల్లీ, మార్చి 8: తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగళూరు, తమిళనా డుకు చెన్నై లాంటి నగరాలు ఉన్నా ఏపీకి చంద్రబాబు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్ అన్నారు. ఇండి యా టుడే నిర్వహించిన కంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. డీలిమిటేష్, హిందీ భాషా వి వాదంపై కూడా తనదైన శైలిలో స్పందించారు. ‘తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రా ష్ట్రాలకు పెద్ద పెద్ద పట్టణాలుంటే ఏంటి మా కు చంద్రబాబు నాయుడు ఉన్నారు.
పాదయాత్ర ఎంతో సాయం చేసింది
‘226 రోజుల పాటు చేసిన పాదయాత్ర ఎంతో సాయం చేసింది. సమస్యల గురించి మరింత తెలిసింది. ఆ పాదయాత్ర వల్ల నాలో ఎంతో పరిపక్వత వచ్చింది.’ అన్నారు.
బలవంతంగా హిందీని రుద్దడం కుదరదు
లోకేశ్ హిందీ భాషా వివాదంపై కూడా స్పందించారు. ‘భారత్‌లో ప్రతి రాష్ట్రం ప్రత్యేకమైనది. స్థానిక భాషను ప్రోత్సహించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. హిందీని బలవంతంగా రుద్దుతారని అనుకోవడం లే దు. ఒకటి కంటే ఎక్కువ భాషలను నేర్చుకోవడం ఎంతో అవసరం.’ అని పేర్కొన్నారు.
డీలిమిటేషన్ సమస్యను అలా వాడుకుంటున్నారు..
‘కొన్ని రాష్ట్రాలు డీలిమిటేషన్‌ను ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వాడుకుంటున్నా యి. కానీ ఏపీ ఎప్పటికీ అలా చేయదు. ఎటువంటి షరతులు లేకుండా ఎన్డీయేకు మా మద్దతు కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాలు ఈ సమస్యతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాయి.’ అని తెలిపారు.