ఆపరేషన్ అనంతరం కొడుకు మృతదేహాన్ని చేతికిచ్చారు
కేపీహెచ్‌పీలో విషాదం
కూకట్‌పల్లి, సెప్టెంబర్ 26: కొడుకుకు కడుపునొప్పి వచ్చిందని ఆసు పత్రికి తీసుకొస్తే.. ఆపరేషన్ అనంతరం అతడి మృతదేహాన్ని తల్లిదండ్రు ల చేతికిచ్చిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరా లు.. కర్నూలు జిల్లాకు చెందిన రవీం ద్ర చౌదరి కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌లో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యా పారం చేస్తున్నాడు. అతడి కుమారుడు వరుణ్ తేజ్ చౌదరి (22) ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 24న వరుణ్‌తేజ్‌కు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నం బర్.1లో గల శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రిలో చేర్పించారు.
డాక్టర్లు పరిశీలిం చి ఆపరేషన్ చేయాలని.. అందుకు అవ సరమైన ఏర్పాట్లు చేయాలని వారి వద్ద నుంచి మెదట రూ.లక్ష బిల్లు కట్టించుకున్నారు. అయితే ఆపరేషన్ పూర్తయిన మరుసటి రోజు (గురువారం) వరుణ్ తేజ్ మృతి చెం దాడని డాక్టర్లు అతడి తల్లిదండ్రులకు చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కొడుకు చనిపోయాడని మృతదేహం తో బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు.. డాక్టర్లతో మాట్లాడి ఆందోళన విరమింపచేశారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.