calender_icon.png 17 November, 2024 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిద్రకు అంతరాయం ఏర్పడితే

15-11-2024 12:00:00 AM

కొంతమంది పిల్లలు అదేపనిగా నిద్రపో తుంటారు. అయితే తమ పిల్లాడు పాఠశాలకు బంద్ కొట్టేందుకే నిద్రపోతున్నాడని భావిస్తా రు తల్లిదండ్రులు. చాలా తక్కువ మంది పిల్లలే అలాచేస్తారు. అయితే ఎదిగే పిల్లలకు నిద్ర చాలా అవసరం అనే విషయం గుర్తుంచుకోవాలి. వారి మెదడు పనితీరుకు నిద్ర ముఖ్యం కూడా. పిల్లలు నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే తగినంత సమయం ఇవ్వాలని చెబుతున్నారు డాక్టర్లు.

అయితే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్య యనం ప్రకారం.. చిన్నపిల్లలో నిద్రకు అంతరాయం ఏర్పడితే అది ప్రమా దకరమైన పరిణామాలను కలిగిస్తుందని స్పష్టమైంది. జ్ఞాపకశక్తికి అవసరమైన నాడీ వ్యవస్థల పెరుగుదలలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని కనుగొన్నారు. పిల్లలు నిద్రలేమితో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. పిల్లలు తక్కువ నిద్రపోవడం వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని పడుతుందని హెచ్చరిస్తున్నారు.