calender_icon.png 16 March, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమె మరణిస్తే.. ఆస్తి ఎవరికి చెందుతుంది?

16-03-2025 12:16:26 AM

ఇంట్లో ఒక మహిళ మరణిస్తే.. తనకు సంబంధించిన ఆస్తి ఎవరికి చెందుతుంది? పిల్లలు లేకపోతే ఆస్తిపై హక్కు ఎవరికి ఉంటుందనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. Hindu Succession Act, 1956, Section 14 ప్రకారం, ఒక మహిళ కష్టార్జితమైన ఆస్తి ఆమె భర్త, పిల్లలకు చెందుతుంది. పిల్లలు లేకపోతే ఆమె భర్తకే మొత్తం ఆస్తి దక్కుతుంది. పుట్టింటి వారికి, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు చెందదు.

క్రిస్టియన్లలో.. భార్య మరణిస్తే Indian Suc-cession Act, 1925, Section 35 ప్రకారం ఆమె భర్తకు 1/3 వంతు, మిగిలినది పిల్లలకు చెందుతుంది. పిల్లలు లేకపోతే సగం ఆస్తి భర్తకు, మిగిలినది ఆమె బంధువులకు చెందుతుంది. మహదీయుల్లో.. భార్య మరణిస్తే.. Islamic Law 1937, Section 13(9) ప్రకారం, 1/4 వంతు భర్తకు, మిగిలినది పిల్లలకు చెందుతుంది. 

 స్వేచ్ఛ 

హైకోర్టు అడ్వకేట్