calender_icon.png 9 March, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్స్‌కు ఎంపికైతే రూ.లక్ష ఇస్తా

11-12-2024 02:18:32 AM

హుస్నాబాద్ సీఎం కప్-2024 ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, డిసెంబర్ 10: స్పోర్ట్స్‌లో నేషనల్ లెవల్‌కు ఎంపిక అయిన నియోజకవర్గం విద్యార్థులకు రూ.లక్ష, రాష్ట్ర స్థాయికి వెళ్లినోళ్లకు రూ.50వేలు ఇస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మినీ స్టేడియంలో సీఎం కప్-2024 క్రీడాపోటీలను ప్రారంభించారు. నియోజకవర్గ విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు.  

బొమ్మ వెంకటేశ్వర్లు విగ్రహావిష్కరణ..

అనంతరం హుస్నాబాద్‌లోని నాగారం చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు విగ్రహాన్ని పొన్నం ఆవిష్కరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యేలు బొమ్మ వెంకన్నతోపాటు దేశిని చినమల్లయ్య, బొప్పరాజు లక్ష్మీకాంతారావు కృషిచేశారన్నారు.

ఆయా కార్యక్రమాల్లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ నర్సారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రజిత, వైస్ చైర్‌పర్సన్ అనిత, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆర్డీవో పాల్గొన్నారు.