calender_icon.png 26 March, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబిన్‌హుడ్ వస్తే లైఫ్‌లాంగ్ క్వారంటైన్!

24-03-2025 12:40:06 AM

‘కరోనా వస్తే 14 డేస్ క్వారంటైన్.. నేనొస్తే లైఫ్‌లాంగ్’ అంటూ నితిన్ చెప్పిన డైలాగ్ ఈసారి ఆయన కామెడీతోనే కాదు యాక్షన్‌తోనూ ఆకట్టుకోనున్నట్టు తెలుస్తోంది. ‘ఏదో ఒకటి చేసి నెక్స్ ఇయర్ పద్మశ్రీ లిస్టులో ఈయన పేరు యాడ్ చేయించేలా చూడు..’ అంటూ శ్రీలీల చెప్పిన డైలాగ్ వింటుంటే రాజేంద్రప్రసాద్ నటనకు ఈసారి ఆ అవార్డు పక్కా అనిపిస్తోంది! ఆద్యంతం నవ్వించే కామెడీ పంచ్‌లు, కట్టిపడేసే యాక్షన్ సన్నివేశాలు, పాటల్లో నాయకానాయికల కెమిస్ట్రీ.. కేతికశర్మ ‘సర్‌ప్రైజ్డ్’ డాన్స్.. మొత్తంగా ప్రేక్షకులు ఈ ఉగాదికి రెండ్రోజుల ముందే షడ్రుచులను ఆస్వాదించబోతున్నారని తెలుస్తోంది!! ఈ ఉపోద్ఘాతమంతా దేని గురించి అనుకుంటున్నారా? నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమా మార్చి 28న థియేటర్లలోకి రానుంది కదా! ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ‘నా పేరు రాము సర్.. ఏజెన్సీకి తగ్గట్టు రాబిన్‌హుడ్ అని మార్చేసుకుంటా..’ అని నితిన్ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది.

ఈ సినిమాలో నీరా వాసుదేవ్ పాత్రలో నటిస్తున్న హీరోయిన్ శ్రీలీలను ఏవీ ఫార్మాస్ట్యూటికల్స్ ఎండీ కూతురుగా పరిచయం చేసిందీ  ట్రైలర్. రాజేంద్రప్రసాద్ తనదైన శైలి నటనను ఇంకాస్త ఎక్కువ పాళ్లలో అందించబోతున్నట్టు తెలుస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించారు.