* చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): జనవరి 26 తర్వాత తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరతాయని కాంగ్రెస్ పార్టీ శాసన మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి చెప్పారు. శనివారం ఆయన ఎమ్మెల్యే లు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ఆర్యవైశ్య చైర్మన్ కల్వ సుజాతలతో కలిసి గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు..
ఏడాదిలోనే ఇచ్చిన హామీలనన్నింటినీ నెరవేరుస్తున్నామని, ఓర్వలేకనే బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ షాబాద్‌లో మాట్లాడారని, జానమ్మ అనే మహిళ రుణమాఫీకి అర్హురాలు కాదని పేర్కొన్నారు. ఆమె కొడుకు పేరిట భూమి ఉందని, ఆయనకు రుణమాఫీ అయ్యిందని తెలిపారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..
పరిగిలో ఏ మండలానికి ఎన్ని కోట్లు ఇచ్చామో గ్రామాలవారీగా చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ఒక్క పరిగి నియోజకవర్గంలోనే రూ. 294 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేసింది మీరేనంటూ కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. షాబాద్‌లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెప్పారు. లోకల్‌బాడీ ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని అన్నారు.