calender_icon.png 23 March, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోడు రైతులను ఇబ్బంది పెడితే ఉద్యమం తప్పదు

22-03-2025 07:31:22 PM

మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేస్తున్న పోడు భూములు ,  ఊర్లలో సాగు, తాగు నీటి కోసం బోర్లు వేయకుండా అడ్డుపడితే ఉద్యమం తప్పదని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పష్టం చేశారు. శనివారం బెజ్జుర్ మండలంలోని వివిధ గ్రామాల పోడు రైతులతో కలసి ఫారెస్ట్ రేంజ్ అఫీస్ వద్దకు చేరుకొని కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం(Kagaznagar DSP Ramanujam), ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లతో మాట్లాడారు. ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా  సహకరించాలని కోరారు. బోరు, బావులకి అనుమతులు ఇవ్వాలని, తాతాల కాలం నుండి సాగు చేసుకుంటూ వస్తున్న  పోడు భూములకు అడ్డు చెప్పొద్దని, కొత్తగా అటవీ భూముల జోలికి వెళ్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో  ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వాలని, లేని పక్షంలో వచ్చే నెల 5న వేల మంది రైతులతో  బెజ్జూర్ ఫారెస్ట్ కార్యాలయం ముందు మహా ధర్నా చేస్తామని స్పష్టం చేశారు.