27-03-2025 12:00:00 AM
విక్రాంత్, చాందినీచౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, షేక్ దావూద్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ‘నాలో ఏదో..’ లిరికల్ సాంగ్‌ను బుధవా రం లాంచ్ చేశారు. ‘నాలో ఏదో మొదలైందని.. నీతో చెలిమే రుజువైందని.. కనులే చెబితే మనసే వినదా.. నిజమే అనదా..’ అంటూ సాగుతున్న ఈ పాటకు సునీల్ కశ్యప్ స్వరాలు సమకూర్చగా, శ్రీజో సాహిత్యం అందించారు. దినకర్ కల్వల, అదితి భావరాజు పాడారు.