calender_icon.png 20 April, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణలీలతో కాలం తిరిగొస్తే..!

11-04-2025 12:00:00 AM

‘పోయిన కాలం తిరిగొస్తే..? దానికి కృష్ణుడి లీలలు కారణమైతే..!’ ఎలా ఉంటుందనే కథతో ఓ సూపర్ నేచురల్ లవ్‌స్టొరీ రూపొందుతోంది. దేవన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణన్ హీరోయిన్. కథ, మాటలు- అనిల్‌కిరణ్‌కుమార్ జీ అందించిన ఈ సినిమాను మహాసేన్ విజువల్స్ బ్యానర్‌పై జ్యోత్స్న జీ నిర్మిస్తున్నారు. దీనికి ‘కృష్ణలీల’ అనే టైటిల్ ఖరారు చేశారు.

‘తిరిగొచ్చిన కాలం’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ గురువారం హైదరా బాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో నిఖిల్, ఆధ్యాత్మికవే త్త ఎల్‌వీ గంగాధర్‌శాస్త్రి్త, డీవోపీ చోటా కే నాయుడు హాజరయ్యారు.

టైటిల్ లాంచ్ ప్రెస్‌మీట్‌లో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. “కృష్ణలీల’తో దేవన్ పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అన్నారు. హీరో, డైరెక్టర్ దేవన్ మాట్లాడు తూ.. ‘ఈ జర్నీ ఒక మిరాకి ల్‌లా  మొదలైంది. గంగాధర్ శాస్త్రికి ఈ కథ చెప్తే ఆయన నాకు విలువైన సూచనలు ఇచ్చారు. హీరో అఖిల్‌తో పరిచయం నాకు స్ఫూర్తినిచ్చింది’ అని చెప్పారు. మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.