calender_icon.png 28 December, 2024 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్థమయ్యేలా చెబితేనే!

24-12-2024 12:00:00 AM

ఏ బంధంలోనైనా చిన్న చిన్న తగాదాలే చినికి చినికి గాలి వానలవుతుంటాయి. చివరికి విడిపోయే స్థితికి చేరుకుంటారు. అయితే ఇలా దూరం పెరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు.

ఏదైనా చిన్న గొడవ మొదలైనప్పుడు ఇద్దరూ పోటీ పడి అరిచినంత మాత్రాన సమస్యకి పరిష్కారం దొరకదని గుర్తు పెట్టుకోవాలి. భాగస్వామి కోపంతో అరుస్తున్నప్పుడు మీరు కూడా ఎదురు వాదనకు దిగకుండా ప్రశాంతంగా ఉండి చూడండి. వారే కొంత సేపటికి మామూలు స్థితికి చేరుకుంటారు. భాగస్వామిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీకు నచ్చని ఏ విషయాన్నైనా కోపంతో చిరుబురులాడుతూ కాకుండా నిదానంగా నచ్చ చెప్పండి. అలాగే మీలో మార్చుకోవాల్సిన విషయాలేమిటో కూడా అడిగి చూడండి. పనులను పంచుకుంటూ, ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా వ్యవహరిస్తూ నడుచుకుంటే బంధం మరింత బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు.