07-02-2025 01:10:13 AM
నాగచైతన్య, సాయిపల్లవి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘తండేల్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. ఈ మూవీ జర్నీలో భాగంగా ప్రమోషన్లలో పాల్గొంటున్న మూవీ టీమ్‌కు సాయిపల్లవి గురించి అభిమానుల నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. హీరో నాగచైతన్య ఆ ప్రశ్నలను సాయిపల్లవి ముందుంచగా ఆమె ఆసక్తికరంగా సమాధాలు ఇచ్చారు. ఆ వివరాలు..
నటన కాకుండా ఇంకా ఏదంటే ఇష్టం?
సాయిపల్లవి: తేనెటీగల పెంపకం అంటే ఇష్టం. ఇటీవల మొదలుపెట్టాను కూడా. (నాగచైతన్య స్పందిస్తూ..) సాయిపల్లవికి బన్ మస్కా (బన్‌తో చేసే ఆహారం), కొబ్బరి నీళ్లు కూడా ఇష్టమే. ఇక రాత్రి 9 గంటలైతే ఎక్కడు న్నా నిద్రపోవటం అలవాటు.
సాయిపల్లవి వాడే సన్‌స్క్రీన్?
సాయిపల్లవి: గుర్తుకొచ్చినప్పుడు రాసుకుంటా. తప్పనిసరైతే కాదు. లేకపోతే మాయిశ్చరైజర్ రాసుకుంటా.
దర్శకత్వం చేయాలనుకుంటే..?
సాయిపల్లవి: అలాంటి ఆలోచనే లేదు. చేయను. (నాగచైతన్య: నువ్వు అబద్ధాలు చెప్తున్నావ్. ఇదే విషయాన్ని నేను అడిగితే, ‘ఎప్పటికైనా దర్వకత్వం చేస్తా. నన్ను కూడా నటుడిగా తీసుకుంటానని చెప్పావ్!’)
ఏదైనా ఫిక్షనల్ క్యారెక్టర్‌తో డిన్నర్ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు?
సాయిపల్లవి: ఒక్కరితో కాదు. సింప్సన్స్ (అమెరికన్ యానిమేటెడ్ సిట్‌కామ్) ఫ్యామిలీతో చేయాలనుంది.
శ్రీకాకుళం యాసలో మాట్లాడేందుకు స్థానికంగా ఎవరినైనా స్పందించారా?!
సాయిపల్లవి: సంభాషణలు పలకడానికి కాస్త ఇబ్బందిపడిన మాట వాస్తవం. గతంలో తెలంగాణ యాస నేర్చుకుని మాట్లాడా. అలాగే ఇది కూడా.
‘తండేల్’ సెట్‌లో నాగచైతన్య చెప్పిన అతి పెద్ద అబద్ధం..?!
సాయిపల్లవి: చైతన్య సెట్‌లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. నేను అక్కడలేని సమయం చూసుకొని, ‘పల్లవి నన్ను పిలిచి, ఆసీన్‌లో ఇలా చేద్దాం.. అలా చేద్దాం.. అని చెబుతోంది’ అంటాడు. నా మాట వినిపించగానే సైలెంట్ అయిపోతాడు!
‘ఓంనమః శివాయ’లో చైతన్య డాన్స్ చూసి మీకేమనిపించింది?!
సాయిపల్లవి: గతంలో చైతన్య డాన్స్ చేస్తుండగా, అప్పుడప్పుడు వెనకడుగు వేసేవాడు. ‘నమో నమః’కు మాత్రం ముందుకు దూకి మరీ ఇరగదీశాడు.
సాయిపల్లవి ఖాళీ సమయంలో ఏం చేస్తుంది?
సాయిపల్లవి: నేను నాలా ఉండటానికి ప్రయత్నిస్తా. సినిమాలు చూస్తా. వంట చేయాలనుకుం టా కానీ, చేయలేను. ఆర్డర్ పెట్టి తినేస్తా. తోట పని చేస్తా. క్యారెట్లు పండిస్తా.
వాట్సాప్ స్టికర్స్ వాడతారా?
సాయిపల్లవి: కోతులు. అబ్బాయిలు ఎలాంటి డ్రెస్‌లు
వాడితే నచ్చుతారు?
సాయిపల్లవి: నాకు తెలియదు. నలిగిపోయిన బట్టలు వేసుకుంటే నాకు నచ్చదు. నా ఫ్యామిలీలో ఎవరైనా అలా కనబడితే, వాటి ని సరిచేయడానికి ప్రయత్నిస్తా.
నాగచైతన్య: అబ్బాయిలూ విన్నారుగా.. ఈసారి సాయిపల్లవిని కలిసే ముందు, మీ డ్రెస్‌ను బాగా ఉతికి, ఇస్త్రీ చేసి వేసుకురండి.