28-03-2025 01:29:16 AM
హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): రాష్ట్రానికి పరిశ్రమలు రాకుం డా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చినా, రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టి భూ సేకరణను అడ్డుకుంటున్నా రని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌పై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్ అయ్యారు.
రాష్ట్రానికి పరిశ్రమలను ఏవిధంగా తీసుకురావాలో తమకు తెలుసునని, ఒక్క పరిశ్రమ ఇక్కడి నుంచి వెళ్లిపోతే వంద పరిశ్రమలను తీసుకొస్తామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేసుకుంటూ పోతుందన్నారు. ఈ విష యంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆరు గ్యారెంటీలు అమ లు చేసి 2028లో ప్రజలను ఓట్లు అడుగుతామని మంత్రి స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని శ్రీధర్‌బాబు ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రశ్నించారు. ప్రధానంగా దళిత సీఎం, దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేశా రా? అని మండిపడ్డారు. ద్రవ్యవినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మం త్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడం గల్‌లోని లగచర్ల ఘటన వెనక బీఆర్‌ఎస్ నేతలే ఉన్నారని, వారు రెచ్చగొట్టడం వల్లే రైతులు ప్రభుత్వ అధికారులపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫార్మా కంపెనీల వల్ల స్థానికులకు ఎన్నో ఉద్యోగాలు వస్తాయని తెలిసినా ప్రతిపక్షాలు కావాలని అడ్డుకుంటున్నాయని మంత్రి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం అభివృద్ధ్ది చెందకూడదనేదే వారి లక్ష్యమని, అందుకోసం పెద్ద కుట్ర చేశారన్నారు. గ్రీన్‌ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామని, ఫార్మా పరిశ్రమ ల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దన్నారు. దావోస్ పర్యటన కేంద్రంగా రూ. 2లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగిందని శ్రీధర్‌బాబు వివరించారు.
కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యో గాలు, విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి జన్‌ధన్ ఖాతాలో ఒక్కో కుటుంబానికి రూ. 15లక్షలు వేస్తామన్న హామీని విస్మరించిందన్నారు. గత పదేళ్లు కేంద్రంలో బీజేపీ, ఇక్కడ బీఆర్‌ఎస్ అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక ల మేనిపెస్టోలో పెట్టిన ప్రతిఅంశాన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే చాలా అమలు చేశామని, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తెలిపారు. డీలిమిటేషన్‌పై బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు.