calender_icon.png 10 January, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాళీ స్థలాల్లో మసీదులు కట్టి ఉంటే వివాదాలు ఉండేవికావు

10-01-2025 01:58:46 AM

కాశీ శారద పీఠం శంకరాచార్యస్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (విజయక్రాంతి): బరేలీకి చెందిన మౌలానా షాహబుద్దీన్ ‘మసీదులను ఖాళీ స్థలాలపై నిర్మించి ఉంటే, ఈరోజు వివాదాలు ఉండేవి కావు’ అని స్వతంత్ర సమయ్, జబల్పూర్ కాశీ శారద పీఠానికి చెందిన శంకరాచార్యస్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పేర్కొన్నారు. జబల్‌పూర్‌కు వెళ్లిన ఆయన మేళాలో భూముల యాజమాన్యంపై దృష్టి సారించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు అనేక ప్రదేశాల్లో భూముల యాజమానినని పేర్కొంటున్నప్పటికీ, ఆ యాజమాన్యం చట్టపరమైన ఆధారాలను వివరించడంలేదని వెల్లడించారు. ‘ఎవరైనా మా దేవాలయాల్లోకి ప్రవేశించి వాటిని తమ ఆధీనంలోకి తీసుకుంటే, మేము సహించబోం. అదే విధంగా మేము వారి మసీదులోకి వెళితే, వారు లోపలికి అనుమతించరు. అందుకే, ప్రజలు పరస్పర గౌరవం చూపిస్తూ తమ హద్దులను కాపాడుకోవాలి.’ అని సూచించారు.

ప్రతి హిందువూ కుంభమేళాకు వెళ్లాలి

ప్రతి హిందువూ ప్రయాగరాజ్ కుంభమేళాకు వెళ్లాలని శంకరాచార్యస్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పిలుపునిచ్చారు. హిందువుల కోసం కుంభమేళా ఒక ముఖ్యమైన ధార్మిక, సాంస్కృతిక సమావేశమని, ఇది సమాజాన్ని బలపరుస్తుందని చెప్పారు.

ప్రభుత్వ విధానాలు తరచుగా హిందువులను తమ మతాచరణలో స్వేచ్ఛగా ఉండనివ్వడంలేదని, ఇలాంటి పరిమితులను తొలగించాలని, అన్ని మతాలకు సమాన హక్కులను ప్రభుత్వం నిర్ధారించాలని డిమాండ్ చేశారు. ప్రజలు తమ మతం, నైతికతలను అనుసరించి ధర్మమార్గంలో జీవించాలని సూచించారు.