పిల్లలకు పాలు పట్టించడం ఎంతో ముఖ్యం. అయితే పాలు సరిపడకపోతే పాలు ఉత్పత్తి కోసం సరైన ఆహారం తీసుకోవాలి. తల్లి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాన్ని తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకున్న పాలు అందకపోతే డాక్టర్‌ను సంప్రదించి డాక్టర్ సూచనల ప్రకారం పిల్లలకు మార్కెట్లో లభించే పౌడర్ ద్వారా పాలను పట్టించవచ్చు. బిడ్డకు సరిగ్గా పాలు అందితే వారానికి 100 నుంచి 140 గ్రాముల బరువు పెరుగుతాడు. తల్లి పాలలో ఉండే పోషక విలువలతో శిశు మరణాలు తగ్గించవచ్చని సర్వేలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఇతర పాలకన్నా తల్లిపాలే ఇవ్వడం మంచిది.