01-03-2025 12:08:59 AM
రాష్ట్ర సచివాలయానికి పాదయాత్ర
కడ్తాల్, ఫిబ్రవరి 28 ( విజయ క్రాంతి ) : పాడి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు కడారి రామకృష్ణ అన్నారు. శుక్రవారం కడ్తాల్ మండల కేంద్రంలో పాడి రైతులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. విజయ పాడి రైతులకు పాల బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రెండు నెలల పదిహేను రోజులు గడుస్తున్న బిల్లులు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవరిస్తుందని అన్నారు.
ఈ విషయంపై అనేక నిరసన కార్యక్రమలా ద్వారా ముఖ్యమంత్రికి ,విజయ డైరీ చైర్మన్‌కి, ఎండి దృష్టికి తీసుకొని పోవడం జరిగిందని, సుమారు 8 నెలల నుండి సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు .పాడి రైతులు రెండు పాడి ఆవులను వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. వారి ఆర్థిక మూలం పాలు. అలాంటి పాల బిల్లులు రెండున్నరా నెలలు గడిస్తే వారి జీవన విధానం అతలకుతం అవుతుంది .
కావున ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలి. చెల్లించని యెడల కల్వకుర్తి నియోజకవర్గం నుండి పాడి రైతుల పోరుబాట కార్యక్రమాన్ని పాదయాత్రగా వెళ్లి సెక్రటేరియట్ ముట్టడి చేయడం జరుగుతుంది.
కావున ప్రభుత్వం స్పందించి మార్చి 5 లోపు పాల బిల్లులు చెల్లించాలి. లేనిచో త్వరలోనే పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడుతాం. ఈ కార్యక్రమంలో పాడి రైతులు చేగూరి మహేష్, నర్లకంటి శేఖర్, పాడి రైతుల మద్దతుదారులు కేషని మహేష్ ,మూఢ రవి, కుకుట్ల మహేష్, శివ పాల్గొన్నారు.