calender_icon.png 19 April, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ పడగొడితే.. రేవంత్ నిలబెడుతున్నారు

11-04-2025 01:24:49 AM

కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ‘తెలంగాణను కేసీఆర్ నిలబడితే.. సీఎం రేవంత్‌రెడ్డి పడగొట్టారు’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. నిజానికి తెలంగాణను పడగొట్టింది కేసీఆర్ కుటుంబమేనని ఆయన విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌తో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని గుర్తుచేశారు.

పదేళ్లు పాలించిన కేసీఆర్ రూ. 7 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని పడగొడితే.. తాము అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ అన్ని విధాలా సరి చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రుణమాఫీ, వరి ధాన్యానికి రూ.500 బోనస్, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్‌కు రూ. 500 ఇస్తున్నది హరీశ్ రావుకు కనిపించడం లేదా? అని నిలదీశారు. హరీశ్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారా? అని ప్రశ్నించగా..  ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించే స్థాయి తనకు లేదని చామల బదులిచ్చారు.