హైదరాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Huzurabad MLA Padi Kaushik Reddy)పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(Jagityal MLA Sanjay) సోమవారం ఫిర్యాదు చేశారు. నిన్న సంజయ్ పీఏ ఫిర్యాదుపై ఎమ్మెల్యే ద్వారా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్(Karimnagar Collectorate)లో జరిగిన జిల్లా కార్యచరణ ప్రణాళిక సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడేందుకు సిద్ధమౌతుండగా ఆయనకు మైక్ ఇవ్వొద్దని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి అడ్డుకుని వీధిరౌడిలా తోటి ఎమ్మెల్యేనైన సంజయ్ పై దాడి చేశాడని ఆరోపించారు.
కౌశిక్ రెడ్డి స్వతహాగా చేశారా..?, ఎవరైనా రెచ్చగొడితే చేశారా..? అనేది తెలాలని పోలీసులను కోరారు. ఈ ఘటనపై అసెంబ్లీ స్వీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటారని ఆయన భావిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ హాయంలో ఇతర పార్టీలకు చెందిన నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారుగా అని అడిగారు. ముందు ఇతర పార్టీల నుంచి చేరికలపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణలు చెప్పి తామ పదవులకు రాజీనామా చేస్తే తను కూడా రాజీనామా చేస్తున్నంటూ ఎమ్మెల్యే సవాలు చేశారు.