calender_icon.png 26 February, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ అనుమతిస్తే సగం మంది ఎమ్మెల్యేలు వెనక్కి!

26-02-2025 12:48:09 AM

  1. పార్టీ మారిన వారిని తిరిగి చేర్చుకోవడంపై గులాభీ బాస్ విముఖత
  2. రేపు ఎస్‌ఎల్‌బీసీ సందర్శనకు బీఆర్‌ఎస్ బృందం
  3. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై త్వరలో నిర్ణయం
  4. మీడియాతో హరీశ్‌రావు చిట్‌చాట్

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): కేసీఆర్ అనుమతిస్తే కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలో సగం మంది ఇప్పటికే వెనక్కి వచ్చేవారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే అందు కు కేసీఆర్ ఒప్పుకోవడం లేదని వివరించారు. మంగళవారం బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మా సార్ (కేసీఆర్) అనుమతిస్తే కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలల్లో ఇప్పటికే సగం మంది వెనక్కి వచ్చేవారు. కానీ అందుకు మా సార్ ఒప్పుకోవడంలేదు’ అని అన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా నాయకులతో బృందంగా ఏర్పడి గురువారం ఎస్‌ఎల్‌బీసీని సందర్శించనున్నట్టు చెప్పారు.

సహాయ చర్యలకు ఆటంకాలు కలగకూడదనే ఉద్దేశంతోనే ఇంత వరకూ అక్కడకు వెళ్లలేదని వివరించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీలో చర్చిం చి నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో ప్రజలను రెచ్చగొట్టి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని  నామ మాత్రపు ఫీజులు కట్టాలని ప్రజలను కోరుతున్నార ని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.  ఎట్టి పరిస్థితు ల్లో ఎల్‌ఆర్‌ఎస్ కట్టొద్దని ప్రజలను కోరారు.

ఎస్‌ఎల్‌బీసీ ప్రకృతి విపత్తంటున్నారు

ఎస్‌ఎల్‌బీసీ ఘటన చాలా బాధ కల్గించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనను ప్రకృతి విపత్తుగా ప్రభుత్వం పేర్కొనడాన్ని తప్పుబట్టారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదంటూ ఆపద సమయం లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చే స్తుందని మండిపడ్డారు.

2005 నుంచి 14 మధ్య కాంగ్రెస్ రూ.3,300 కోట్లు ఖర్చు పెడితే, 2014 నుంచి 2023 మధ్య బీఆర్‌ఎస్ రూ.3,900 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమా దం ప్రకృతి విపత్తు అయినప్పుడు కాళేశ్వరం కుంగుబాటు కూడా ప్రకృతి విపత్తు ఎందుకు కాదని  ప్రశ్నించారు. ఉద్యోగాల పేరు తో మో సం చేసిన కాంగ్రెస్‌ను, బడ్జెట్‌లో తెలం గాణకు అన్యాయం చేసిన బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.