calender_icon.png 12 February, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం జలాలు రాకపోతే.. 300 ఎకరాలు బీళ్లే..

12-02-2025 12:00:00 AM

పెన్‌పహాడ్‌లో ఎండిన పొలాలలో రైతుల నిరసన 

పెన్‌పహాడ్, ఫిబ్రవరి 11 : మూడు రో జుల్లో కాళేశ్వరం జలాలు రాకపోతే ఆయ కట్టు కింద సాగు చేసిన 300 ఎకరాలు పైబడి వరి పంట నేర్రలు బారీ బీడు భూ ములుగా మారుతాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ తమ ఎండిన పంట పొలాల్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు.

సూర్యా పేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధి లోని చిన్నగారకుంట తండా, చిన్న సీతారాం, పెద్ద సీతారాం తండా, ఎల్లప్పకుంట తం డా, చెట్లముకుందాపురం చెందిన రైతులు కలసి ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువ చివరి ఆయ కట్టు కింద కాళేశ్వరం జలాలతో సాగు చేసిన వరి పొలాలు కొన్ని దినాలుగా సాగు నీళ్లు రాకపోవడంతో పొలాలు ఎండి పోయిన దశకు చేరుకున్నాయి.

ఇప్పటికే బోర్లు బావులు అదెరువు ఉన్న రైతులు  వరుస తడులు చేస్తున్నారు. ఏ అదెరువు లేని రైతులు సాగు చేసిన వరి పొలాలు నేర్రలు బాసాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సార్లు సాగు నీటి విధులకు ఉన్నత అధికారులకు మా గోడును విన్న వించుకున్నామని తెలిపారు.

మంత్రి ఉత్త మ్ రైతుల పక్షపాతి అని వెంటనే మంత్రి స్పందించి 3 రోజుల్లో కాళేశ్వరం జలాలు చివరి ఆయకట్టుకు నీళ్లను అందించాలని లేని పక్షంలో గాంధీ భవన్ ముట్టడిస్తామని మా రైతుల చావులకు మంత్రి కారకుల వుతారని రైతులు హెచ్చరించారు.