మేలు చేసే ప్రాజెక్టులకు సహకరించాలన్న మంత్రి తుమ్మల
హైదరాబాద్, జూలై 7(విజయక్రాంతి): రెండు రాష్ట్రాలకు మేలు చేసే జాతీయ రహదారులు, జలవనరులు, రైల్వేలైన్ల పనులకు సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ.. పట్టిసీమ నుంచి ప్రకా శం బ్యారేజ్‌కు అక్కడ నుంచి పులిచింతల, నాగార్జున సాగర్‌కు గోదావరి జలాలు తరలింపు భవిష్యత్తులో కీలకమన్నారు. పట్టిసీమ నుంచి కొండపల్లి రైల్వేలైన్ పనులు పూర్తయితే ఇరు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరమని సూచించారు. రైల్వేలైన్‌తో పుణ్యక్షేత్రాలు సందర్శించే భక్తులను ఉప యోగం ఉంటుందని చెప్పారు. కొత్తగూడం నుంచి పెనుబల్లి రైల్వేలైన్ పూర్తయిందని ఏపీలో రైల్వేలైన్‌పై దృష్టి పెట్టాలని కోరారు.