calender_icon.png 25 October, 2024 | 4:59 AM

పునరుజ్జీవం పేరిట కూలిస్తే ఊరుకోం

25-10-2024 12:39:33 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాం తి): మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ పథకం పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీఎత్తున అవినీతికి తెరలేపుతోందని గురువారం ఆయన ఓ ప్రకటనలో ఆరోపించారు. రూ.1.50 లక్షల కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలాగా ఉపయోగించుకోవాలని భావిస్తోందన్నారు.

గత పాలకులు చేసిన దాదాపు రూ.6 లక్షల కోట్ల పైచీలుకు అప్పులకు 10 నెలల్లోనే రూ.60 వేల కోట్లు వడ్డీలు చెల్లించడం ద్వారా ప్రజాధనం వృథా అయ్యింద న్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికి నానా తంటాలు పడుతూ సంక్షేమ పథకాలను అమలు చేయలేని పరిస్థితి నెలకొందని వాపోయారు.

ఈ పరిస్థితుల్లో మరో లక్షన్నర కోట్ల రూపాయల అప్పుచేసి మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇండ్లను కూల్చాల నుకోవడం దుర్మార్గమన్నారు. దేశంలో నే అత్యధికంగా అప్పుల్లో ఉన్నది తెలంగాణ వాసులేనని.. రాష్ర్టంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉందని.. జాతీయ సగటు కంటే రూ.40 వేలు ఎక్కువన్నారు.

రాష్ర్టంలో దాదాపు 92 శాతం కుటుంబాలు అప్పుల్లోనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన శుక్రవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు జీ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో  ధర్నాను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.