calender_icon.png 27 October, 2024 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అక్రమ కట్టడమైతే నేనే కూల్చేస్తా’

28-08-2024 01:17:47 AM

మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27  (విజయక్రాంతి): తన ఇంటి నిర్మాణం(గెస్ట్‌హౌజ్) అక్రమమైతే తానే దగ్గరుండి కూల్చే స్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మీడి యా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి ఇస్తేనే తాను గెస్ట్‌హౌజ్ నిర్మించుకున్నానని, చెరువు భూమిని కబ్జా చేయలేదన్నారు.

హైడ్రా కొనసాగిస్తున్న కూల్చివేతల క్రమంలో హిమా యత్‌సాగర్‌కు సంబంధించి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో నిర్మించాననే వార్తల నేపథ్యంలో తన గెస్ట్‌హౌజ్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. గండిపేట చెరువు పైభాగాన కొత్వాల్‌గూడలో 14.14 గుంటల భూమిని 1999లో భూమిని కొనుగోలు చేశానని, అది తన కొడుకు రినీశ్ పేరుపై ఉందని తెలిపారు. పట్టా ల్యాండ్ తీసుకుని మామిడి తోట, వరి సాగు చేస్తున్నామన్నారు. ఇరిగేషన్ అధికారులు, కలెక్టర్ చెప్పిన నిబంధనల ప్రకారమే హంగులు, ఆర్భాటాలు లేకుండా చిన్న ఇల్లు కట్టుకున్నామని చెప్పారు.

111 జీవో ప్రకారం ఉన్న వ్యవసాయ భూమిలో 10 శాతం నిర్మాణం చేసుకోవచ్చన్నారు. ఇంటి నిర్మాణంపై ఇప్ప టి వరకు తనకు ఎలాంటి నోటీసులు రాలేదని పేర్కొన్నారు. ఒకవేళ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో ఉంటే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, 111 జీవో పరిధిలో తా నొక్కడినే కాదని, చాలా మంది నిర్మాణాలు చేపట్టారని తెలిపారు.

వీరిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు  బడా నేతలు ఉన్నారన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం అనుమతి ఇస్తేనే నిర్మించుకున్నామన్నారు. ఇది 20 యేళ్ల క్రితం కట్టిన బిల్డింగ్ అని చెప్పుకొచ్చారు. రోజూ పత్రికల్లో తన గెస్ట్‌హౌజ్ ప్రస్తావన వస్తుండటంతోనే క్లారిటీ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చానన్నారు. చెరువులు అక్రమించి కట్టిన నిర్మాణాల కూల్చివేతలను సమర్థిస్తున్నటు,్ల బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా హైడ్రాకు సంపూర్ణ మద్ధతుగా నిలుస్తానని ఆయన చెప్పారు.