28-03-2025 01:53:25 AM
కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): తెలంగాణ ధనిక రాష్ట్రమైతే వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఎందుకు ఉంచారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. అప్పులు ఉన్నా ఆదాయం పెంచామని చెబుతున్న బీఆర్‌ఎస్.. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేకపోయిందన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై కేటీఆర్ మాట్లాడుతుండగా.. జోక్యం చేసుకుని మంత్రి ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కాంట్రాక్టు బిల్లులు పెండింగ్ రూ.40 వేల కోట్ల ఉన్నాయని, సర్పంచ్ బిల్లులు సైతం ఇవ్వలేదని మండిపడ్డారు.