calender_icon.png 4 October, 2024 | 4:55 AM

సనాతన ధర్మానికి హాని కలిగిస్తే ఊరుకోం

04-10-2024 01:14:23 AM

హిందూ దేవుళ్లపై దాడులు జరిగితే ఎవరూ ప్రశ్నించరు

ఇతర మతాల దేవుళ్లను తిడితే వాళ్లు అలాగే వదిలేస్తారా!

హిందువుల్లో ఐక్యత లేకపోవడమే ఇందుకు కారణం

ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినిపించవా?

వారాహి డిక్లరేషన్‌లో సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాం తి): లౌకికవాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని, హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

మిగతా మతాలపై దాడి జరిగితే.. ప్రముఖులంతా మాట్లాడుతున్నారని, తప్పని తెలిసి కూడా సనాతన ధర్మంపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడకపోవడం ఇంకా పెద్ద తప్పు అన్నారు. సనాతన ధర్మం, హిందూ దేవుళ్లను విమర్శించే వారు ఎక్కువయ్యారని, ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినిపించవా అని ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో ఆయన వారాహి డిక్లరేషన్‌ను ప్రకటించారు. 

బలమైన చట్టం అవసరం

సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక బలమైన చట్టం అవసరమని అభిప్రాయ పడ్డా రు. ఏ మతానికి, ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే లౌకిక వాదాన్ని పాటించాలని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగ జేసే చర్యలను అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసర ముందని, దాన్ని తక్షణమే తీసుకురావాలని చెప్పారు.

సనాతర ధర్మ పరిరక్షణ కోసం తీసుకొవచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ర్ట స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని పేర్కొ న్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు యేటా నిధులు కేటాయించాలని అందులో పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని కించపరచి, విషాన్ని చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలని వెల్లడించారు.

ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధ్రువీకరించే విధానాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా విద్యా, కళలు, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని, ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని డిక్లరేషన్‌లో తెలిపారు. 

హిందువుల్లో ఐక్యత లేకపోవడమే..

ఒక డిప్యూటీ సీఎంగానో.. జనసేన పార్టీ అధ్యక్షుడిగానో ఇక్కడికి రాలేదని.. హిందువుగా.. భారతీయుడిగా ఇక్కడికి వచ్చానన్నారు. తిరుపతిలో కల్తీ ప్రసాదం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల సమయం.. సినిమా సమయం కాదని, ఇది భగవంతుడి సమయమని స్పష్టం చేశారు. సనాతన హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వడం లేదని, ఇతర మతాలను చూసి నేర్చుకోవాలన్నారు.

దేశంలో హిందూ దేవుళ్ల పట్ల చాలా దాడులు జరిగాయని పవన్ గుర్తుచేశారు. ‘రాముడిని తిడితే నోరెత్తకూడదు.. మనది లౌకికవాద దేశమంటారు. ఇతర మతా ల్లో వాళ్ల దేవుడిని తిడితే.. వాళ్లు వదిలేస్తా రా’ అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకున్నా ఎవరూ మాట్లాడరని.. మనం మాత్రం పళ్ల బిగువున బాధను భరించాలా అని పవన్ ప్రశ్నించారు.

హిందువుల్లో ఐక్యత లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారని, హిందువులంతా ఏకమయ్యే సమయం ఆసన్నమైందన్నారు. మన మతం గురించి మాట్లాడు కోవాలంటే భయపడే స్థితికి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇతర మతాలపై ఏవైనా వ్యాఖ్యలు గానీ, దాడులు గానీ జరిగితే.. లౌకికవాదు లు, న్యాయస్థానాలు ముందుకొస్తాయని.. అదే హిందూ మతంపై, సనాతన ధర్మాన్ని కించపరిచినా, దాడులు చేసినా ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ లాంటి వారు సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ముందుకొస్తే మతోన్మాదులులగా చిత్రీకరిస్తున్నారన్నా రు. తిరుపతి లడ్డూ కల్తీ పాపాన్ని పోగొట్టేందుకు తాను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే దాన్ని అవహేళన చేస్తున్నారని పవన్ మండిపడ్డారు.