calender_icon.png 16 January, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలుస్తామంటే ఊరుకోం!

08-07-2024 01:09:23 AM

  1. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదు
  2. బీఆర్‌ఎస్ హయాంలో ప్రజాస్వామ్యం అపహాస్యం
  3. మంత్రి జూపల్లి ఫైర్

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్, బీజేపీ మిలాఖత్ అయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నాయని, తమ ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకో మని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాం లో పార్టీ అధినేత కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, పార్టీ ఫిరాయి ంపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్ నాయకులకు లేదని అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ వస్తే మాకు చాలు. నాకు ఏ పదవి వద్దు. దళితుడినే సీఎం చేస్తాను’ అని నాడు కేసీఆర్ ప్రకటించిన సంగతి నిజం కాదా అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ తీరుకు ప్రజలు విసిగిపోయి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడించారని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఒక్కసీటు కూడా దక్కనివ్వలేదన్నారు. కేసీఆర్‌కు విలువలు ఉండి ఉంటే, నాడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకునే వారు కాదన్నారు. ప్రజాస్వామ్యంగా ఏర్పడిన కాంగ్రె స్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్‌ఎస్ నాయకులు పదే పదే ఉద్ఘాటిస్తున్నారని, అలా చేస్తుంటే తాము చూస్తూ కూర్చోలేమని కుండ బద్దలు కొట్టారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గ గాంధీకి ప్రధాని అయ్యే అవకాశాలు వచ్చినా, వారు సున్నితంగా తిరస్కరించారని గుర్తుచేశారు. అలాంటి మంచి వ్యక్తి త్వం ఉన్న నేతలను విమర్శించేస్థాయి మాజీమంత్రి నిరంజన్‌రెడ్డికి లేదన్నారు. ఆయన లేఖ రాయాల్సింది రాహుల్‌గాంధీకి కాదని, బీజేపీతో కుమ్మక్కై చట్టాలను తుంగలోకి తొక్కిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు రాయాల్సి ఉందని హితవు పలికా రు. బీఆర్‌ఎస్ హయాంలో ఆ పార్టీ నాయకులు పాల్పడిన అవినీతి, అక్రమాల సంగ తి ప్రజలకు తెలుసునన్నారు. ఇప్పుడు అధికారం చేజారగానే బీఆర్‌ఎస్ నాయకులు విలువల గురించి మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉందన్నారు.