11-04-2025 12:32:50 AM
న్యూయార్క్, ఏప్రిల్ 10: ఇరాన్‌తో అణు ఒప్పందం కోసం అమెరికా ప్రభుత్వం తీ వ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యా ఖ్యలు చేశారు. ఇరాన్ అణు ఒప్పందానికి అంగీకరించకుంటే సైనిక చర్యకు దిగుతా మని హెచ్చరించారు. శనివారం ఒమన్‌లో ఇరుదేశాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు ఒప్పం దానికి అంగీకరించకపోతే సైనిక చర్య ఉం టుందా? అని ఒక విలేకరి ప్రశ్నించారు.
దీని పై ట్రంప్ స్పందిస్తూ.. ‘అవసరాన్ని బట్టి చర్య లు ఉంటాయి. ఇరాన్ అణు ఒప్పందానికి ఒప్పుకోకపోతే సైనిక చర్యకు దిగుతాం. ఇం దులో ఇజ్రాయెల్ ప్రమేయం కూడా ఉం టుంది’ అని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో పరోక్ష ఉన్నతస్థాయి చర్చలు మాత్ర మే ఉంటాయని తెలిపింది.
ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే సాగా యి. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 2018లో అణుఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్‌పై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి ఎన్నో ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈక్రమంలో మరోసారి అణుఒప్పందంపై ఇరాన్‌తో చర్చ లు జరిపేందుకే ప్రాధాన్యం ఇస్తానని, ఎందుకంటే తాను ఆ దేశాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదని పేర్కొన్నారు.
అయితే ట్రంప్‌తో ప్రత్యక్ష చర్చలను ఇరాన్ అధ్యక్షుడు మసూ ద్ పెజెష్కియాన్ తిరస్కరించారు. దీనిపై ఆగ్ర హం వ్యక్తం చేసిన ట్రంప్ అణు ఒప్పందంపై టెహ్రాన్ డీల్‌కు నిరాకరిస్తే బాంబు దాడులు తప్పవన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అగ్రరాజ్యం దాడులకు తెగబడి తే ఎదురుదాడులకు వెనుకాడమని స్పష్టం చేశారు.