18-03-2025 01:08:09 AM
ఎస్‌ఈ స్థాయి అధికారి 8 రోజుల సెలవుపై విచారణ చేపట్టాలి అనర్హులైన ముగ్గురికి
సేల్ ఆర్డర్ ఎలా ఇచ్చారు ‘విజయక్రాంతి’తో సొసైటీ అధ్యక్షుడు ధర్మసొత్ చందర్
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 17 (విజయక్రాంతి) బూడిద తొలకాల్లో తమకు తీరనిలో అన్యాయం జరిగితే ఆందోళన ఉదృతం చేస్తామని గిరిజన ఎస్సీ ఎస్టీ వడ్డెర కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మసోత్ చందర్ హెచ్చరించారు.
సోమవారం విజయ క్రాంతి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని కేటీపీఎస్ బూడిద తోలకాల వ్యవహారంలో ప్రభావిత ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈనెల 31 వరకు కొనసాగుతున్న సేల్ ఆర్డర్ పొడిగింపు చేస్తే ఆందోళన ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
కోర్టు ఆర్డర్ ను సైతం జనకు అధికారులు అమలు చేయకుండా అన్యాయం చేశారన్నారు. అనర్హులైన వారికే సేల్ ఆర్డర్ ఇచ్చి, ప్రభావిత ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వాస్తవంగా గత కొన్ని సంవత్సరాలుగా బూడిద తోలకాలు జనరల్ కేటగిరీలో అన్ని కులస్తులు కలిసి బూడిదను తోలుకునే వారని, దీంతో ప్రభావిత ప్రాంత గిరిజన యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకపోగా అవస్థలు పడు తున్నారు. దీంతో నాలుగు గ్రామాల యువకులు కలిసి సొసైటీగా ఏర్పాటు చేసుకొని బూడిద తోలకాలను ప్రభావిత ప్రాంత గిరిజనులకే అవకాశం కల్పించాలని, జనరల్ కేటగిరీకి అవకాశం ఇవ్వొద్దని కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు.
అందుకు కోర్టు ఖర్చుల కింద సొసైటీకి చెందిన 55 మంది సభ్యులు నిధులను సమకూర్చుకొని త్రిమూర్తులపై పిటిషన్ దాఖలు చేయటమే తమ పాలిటి శాపం అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయించిన గిరిజన సొసైటీకి గిరిజనులు బూడిద తరలించేందుకు ఆర్డర్ ఇస్తూ పిటీషనర్ లైన ముగ్గురికి అవకాశం కల్పించాలని కోర్టు తీర్పుజారీ చేసిందన్నారు.
కోర్టు తీర్పుకు విరుద్ధంగా జన్కో అధికారులు వ్యవహరించి గిరిజన సొసైటీ సభ్యులకు కాకుండా , కేవలం పిటీషనర్లైన ముగ్గురికి సెల్ ఆర్డర్ ఇవ్వటం తో తమకు తీరని అన్యాయం జరిగిందన్నారు. వారి సేల్ ఆర్డర్ ఈనెల 31 వరకే ఉందని, జనుకో అధికారులు ఇప్పటికైనా వారి సేల్ ఆర్డర్ అంతటితో ముగించి తమకు న్యాయం చేయాలని , పొడిగించ రాదని ఆయన కోరారు .
ప్రస్తుతం బూడిద చెరువులో 9 లక్షల మెట్రిక్ టన్నుల బూడిద నిలవలు ఉన్నాయని, బూడిద తోలకాలకి జెన్కో అధి కారులు సహకరించకుండా వ్యవహరిస్తున్నారు అన్నారు. బూడిదను తరలిస్తే వచ్చే ఆదాయం కన్నా, చెరువు కట్ట పెంచితే రూ 100 కోట్ల వరకు ఖర్చవుతుందని, దానిపైన వచ్చే కమిషన్లు దండిగా ఉంటాయని అందు కే జనకు అధికారులు బూడిద తోలకాల కన్నా కట్ట పెంచేందుకే మొగ్గు చూపుతున్నారన్నారు.
జనుకో అధికారులు సేల్ ఆర్డర్ ఇచ్చిన ముగ్గురు సైతం అనర్హులని తెలిపారు. వారిలో మొదటి అభ్యర్థి తండ్రి కేటీపీఎస్ కాంట్రాక్టర్ అని, భార్య వైద్య ఆరోగ్యశాఖలో నర్సుగా పనిచేస్తుందనీ, తమ్ము డు మరదలు సైతం ప్రభుత్వ ఉద్యోగులని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న తప్పుడు దృవీకరణ పత్రాలతో సొసైటీలో సభ్యులుగా నమోదు చేయించారని ఆయన ఆరోపించారు. రెండో పిటీషనర్ క్లీన్ అండ్ గ్రీన్ ఎర్త్ సొసైటీ పేరుతో స్వచ్ఛంద సంస్థ నడుపుతూ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా
బూడిద కాంట్రాక్టర్ సేల్ ఆర్డర్ పొందాడని తెలిపారు. మూడో పిటీషనర్ తండ్రి కేటీపీఎస్ ఉద్యోగ చేస్తూ మరణించడం, తల్లి కేటిపీఎస్ పెన్షన్ హోల్డర్ అయినా బూడిద సేల్ ఆర్డర్ పొందటం ఏమిటని ఆయన ప్రశ్నించాడు. సొసైటీ సభ్యులు ఎవరైనా ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా , కుటుంబంలో ఎవరూ ప్రభుత్వం నుంచి లబ్ది పొందకుండా ఉన్నవారే అర్హులన్నారు.
ప్రస్తుతం బూడిద సేల్ పొందిన ముగ్గురు అనర్హులని ఆయన స్పష్టం చేశారు. ఐటీడీఏ పీవో గిరిజన సొసైటీ సభ్యులను ఎంపిక చేసి బూడిద సేల్ ఆర్డర్ కు అర్హులుగా ప్రకటించారని, జెన్కో అధికారులు సొసైటీ సభ్యులకు సేల్ ఆర్డర్ ఇచ్చారని, తాము డిపాజిట్ సొమ్మును చెల్లించడం జరిగిందన్నారు. బూడిద తరలించేందుకు సిద్ధమైన తమ సొసైటీ సభ్యులను బూడిద తరలింపు నిలిపివేయాలంటూ జెన్కో అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు.
అదే సమయంలో ఎస్ ఈ సివిల్ అధికారి 8 రోజులపాటు సెలవు వెళ్లడంతో, అనర్హులైన త్రిమూర్తులు జన్కో అధికారులు ఇచ్చిన బూడిద సేల్ ఆర్డర్ పై స్టేట్ తెచ్చుకునేందుకు పరోక్షంగా వారే సహకరించారని ఆయన ఆరోపించారు.
ఇప్పటికైనా జెన్కో అధికారులు ప్రభావిత ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని, కోర్టు ఆర్డర్ ను తూచా తప్పకుండా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభావిత ప్రాంత ప్రజలతో కలిసివిద్యుత్ సౌధాను ముట్టడిస్తామని హెచ్చరించారు