calender_icon.png 24 February, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలిపిస్తే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తా..

24-02-2025 06:39:04 PM

బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి..

బెల్లంపల్లి (విజయక్రాంతి): ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి అభ్యర్థించారు. సోమవారం బెల్లంపల్లిలోని తాపీ కార్మిక సంఘం భవనంలో ఏర్పాటు చేసిన బిజెపి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పట్టభద్రులు తనను గెలిపిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాము ఏ.శ్రీదేవి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏ మాజీలు మాట్లాడుతూ... బెల్లంపల్లి నియోజకవర్గంలోని పట్టభద్రులు అంజిరెడ్డికి ఓట్లు వేసి గెలిపించే విధంగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రజనీష్ జైన్, పట్టి కృష్ణ, నాయకులు కోయిల్ కార్ గోవర్ధన్, రాచర్ల సంతోష్, కమల, రజిని, సంగీత, స్రవంతి, రమణా యాదవ్, సంపత్, శేఖర్, దార కళ్యాణి, కేశవరెడ్డి లు పాల్గొన్నారు.