13-02-2025 10:31:30 PM
శ్రీపాల్ రెడ్డి...
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలో పిఆర్ టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి గురువారం పర్యటించారు. ఉపాధ్యాయుల పలు సమస్యల గురించి మాట్లాడుతూ... ఉపాధ్యాయులంతా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే, రాజకీయాలకతీతంగా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తూ బంజారా ఉపాధ్యాయులకు, ప్రజలకు సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా కార్యదర్శి రవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయనిర్మల, జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్, టేకులపల్లి మండల అధ్యక్ష, కార్యదర్శులు మోతిలాల్, రమేష్ బాబు, టేకులపల్లి ఎంఈఓ జగన్, జోగా రవి, ఇల్లందు మండల అధ్యక్షులు రమేష్, రమణ, మంగ్త్య, బాలాజీ, రాందాస్, వెంకట రామయ్య, శంకర్, కస్నా, మంగీలాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.