‘బేబీ’ చిత్రంతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ద్వయం సంచలన విజయం సాధించింది. అలాగే ‘90స్’ వెబ్ సిరీస్‌తో దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి కుటుంబానికి చేరువయ్యారు. ప్రస్తుతం ఈ ముగ్గురితో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, తమ ప్రొడక్షన్ నెం. 32ని ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాతలు అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. ‘90స్’ సిరీస్ లో చిన్న పిల్లవాడు ఆదిత్య పాత్ర ఎంతలా ప్రేక్షకుల మనసులను గెలుచుకుందో తెలిసిందే.
ఆ పిల్లవాడు పది సంవత్సరాల తర్వాత పెద్దవాడైతే, ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే, అతనికి ఒక అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ చిత్ర కథ పుట్టినట్లుగా అనౌన్స్మెంట్ వీడియోలో చూపించారు. “మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి.
ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ” అంటూ వీడియో చివరిలో ఆనంద్ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూ న్ ఫోర్ సినిమాస్ పతాకాలపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.