మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని పినపాక మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఆరు కాలం పండించిన వరి ధాన్యం కుప్పలు రోడ్డుపై ఆరపోసి ప్రమాదాలకు కారణం కాకూడదని ఏడూళ్ళ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన పినపాకలో రహదారిపై ఆరబోసిన ధాన్యం కుప్పలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎవరు రోడ్డుపై ధాన్యం అరోబోయరాదని హెచ్చరించారు. వాహనదారులు కొన్ని సందర్భాల్లో చుసుకొక ధాన్యం కుప్పలపై వాహనం నడిపే ప్రమాదం జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. రాత్రి వేలల్లో వాహనదారులు ఆ ధాన్యం కుప్పలను గ్రహించలేరణని కాబట్టి రైతులేవ్వరు కూడా రోడ్డుపై వరి ధాన్యాన్ని అరబోయవద్దని కోరారు. తమ ప్రాణాలను నమ్ముకొని వారి కుటుంబాలు ఉంటాయన్నారు. ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని కోరారు.