calender_icon.png 24 December, 2024 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమి ఇవ్వకపోతే క్రీడా మైదానం స్వాధీనం చేసుకుంటాం

23-12-2024 10:27:01 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలంలోని రాజేష్ బాబు తండాలో తమ సొంత భూమిని క్రీడా మైదానానికి వాడుకున్న అధికారులు తమకు ఇప్పటికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడం లేదని రైతులు మోతిరామ్ జాదవ్ కిరణ్ అన్నారు. సోమవారం భూమికి బదులుగా భూమి కేటాయించాలని లేనిపక్షంలో క్రీడా స్థలం కోసం ఏర్పాటు చేసిన తమ భూమిని తమకు అప్పగించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యవసాయ కార్మికుల సంఘం మద్దతు పలికారు.