calender_icon.png 4 April, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవుడి భూమి పోతేపోనీ.. మాకేంటి!

02-04-2025 12:25:08 AM

  1. దేవాదాయ శాఖ స్థలాల రక్షణపై ఎండోమెంట్ అధికారుల తీరిదీ..
  2. తమకు ముడుపులు అందితే చాలన్నట్లు వ్యవహారం 
  3. ఆల్కపూర్ కాలనీలో 12 కోట్ల విలువైన భూమి కబ్జా 
  4. పలుమార్లు కాల్ చేసినా స్పందించని ఈఓ, ఇన్స్పెక్టర్, జిల్లా సూపరింటెండెంట్
  5. అత్యంత ఉదాసీనంగా అధికారుల తీరు  
  6. జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి 

రాజేంద్రనగర్, ఏప్రిల్ 1(విజయక్రాంతి): దేవుడు భూమే కదా.. పోతే పోనీ మాకేంటి అనుకున్నారో ఏమోమరి ఎండోమెంట్ అధికారులు.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కోట్లు విలువ చేసే స్థలం పరాధీనమైన చలనం లేకుండా వ్యవహరిస్తున్నారు. గండిపేట మండల పరిధిలోని మణికొండ ము న్సిపల్ ఆల్కపూర్ కాలనీలో రోడ్ నెంబర్ 16 లో  12 కోట్లు విలువచేసే దేవాదాయ శాఖ భూమిని అక్రమార్కులు చెర పట్టినా ఎండోమెంట్ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాకు ముడుపులు ముడితే చాలు.. అన్నట్లుగా దేవాదాయ శాఖ అధికారుల వ్యవ హారం కనిపిస్తోంది. ఆల్కపూర్ లోని తుల్జా రాం బాగ్ ఆలయానికి సంబంధించి సర్వే నెంబర్ 112, 116, 125 లో 800 గజాల స్థలం ఉందని ఎండోమెంట్ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం, పట్టింపు లేనితనంతో కొందరు అక్రమార్కుల కన్ను సదరు స్థలంపై పడింది. ఇంకే ముంది తప్పుడు పత్రాలు సృష్టించారు. సర్వే నెంబర్ 117 లో ఉన్న కొందరు తప్పు డు పత్రాలు సృష్టించి దేవాదాయ శాఖ భూమిని కబ్జా చేశారని సంబంధిత అధికారులే వెల్లడించారు.

ఫిబ్రవరి 22న స్థలం స్వాధీనం..

 స్థానికులతో పాటు మీడియా ఎండోమెంట్ అధికారుల దృష్టికి పలుమార్లు 12 కోట్ల విలువచేసే స్థలం కబ్జా వ్యవహారాన్ని తీసుకెళ్లగా గత ఫిబ్రవరి నెలలో 22వ తేదీన ఘటనా స్థలానికి స్థానిక ఎండోమెంట్ ఈ వో అరుణకుమారి, అదేవిధంగా ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి, ఎండోమెం ట్ శాఖ రంగారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ మోహన్ రావు తదితరులు చేరుకున్నారు. సదరు స్థలం ఎండోమెంట్ శాఖది అని స్పష్టం చేశారు.

800 గజాల స్థలాన్ని స్వాధీ నం చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే అక్రమార్కులు కబ్జా చేసిన స్థలం చుట్టూ భారీ ఎత్తున షీట్లు వేసి రాత్రింబవళ్లు డ్రిల్లింగ్ పనులు చేశారు. పెద్ద పెద్ద హిటాచీలు, జెసిబి లతో పనులు చేస్తుండగా వాటి ని సీజ్ చేసినట్లు కూడా వెల్లడించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో స్వాధీనం చేసుకున్న స్థలాన్ని గాలికి వదిలేశారు. ఇంకేముం ది దర్జాగా అక్రమార్కులు తిరిగి వచ్చి దేవాదాయ శాఖ స్థలంపై వాలారు. మళ్లీ దర్జాగా పనులు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

ఏమాత్రం స్పందించని ఎండోమెంట్ అధికారులు 

 12 కోట్లు విలువ చేసే ఎండోమెంట్  స్థలాన్ని కబ్జా చేయడం, అదేవిధంగా అధికారులు దానిని స్వాధీనం చేసుకోవడం, తిరిగి అక్రమార్కుల చెరలోకి వెళ్లిపోవడంపై ఎండోమెంట్ అధికారులను పలుమార్లు ఫోన్లో వివరణ కోరే యత్నం చేయగా ఏమాత్రం స్పందించడం లేదు. దేవాదాయ శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంపై ప లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న స్థలం తిరిగి అక్రమార్కులకు అప్పగిం చడం ఏమిటని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దేవాదాయ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహ రిస్తున్నారు. 

కలెక్టర్ చర్యలు తీసుకోవాలి 

కోట్లు విలువ చేసే స్థలం పరాధీనం కావడంపై స్థానికులు దేవాదాయ శాఖ అధికారుల తీరుపై ధ్వజమెత్తుతున్నారు.  అధికారులు పూర్తిగా అక్రమార్కులకు మోకరిల్లు తున్నారని మండిపడుతు న్నారు. ఈ విషయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.