07-07-2024 01:57:30 AM
మా పార్టీ నేతలెవరూ తప్పుకోమనలేదు..
ట్రంప్‌తో జరిగిన చర్చలో తడబడిన మాట వాస్తవమే..
టీవీ చానల్ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు జో బైడన్
వాషింగ్టన్, జూలై 6: ‘దేవుడు దిగి వచ్చి దిగిపో అంటేనే వైదొలుగుతా. విదేశీ నేతలు, జాతీయ భద్రతా మండలి అధికారుల భేటీలో జరిగిన పొరపాట్లకు నాదే బాధ్యత. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చలో తడబడిన మాట వాస్తవమే. ఆ సమయంలో కాస్త అస్వస్థతకు గురయ్యా’ అని అమెరికా అధ్యక్షుడు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జోబైడన్ స్పష్టం చేశారు. జూన్ 27న ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్ జరిగిన చర్చలో బైడన్ తడబడటంతో సొంత పార్టీ నేతలే పోటీ నుంచి తప్పుకోవాలని కోరుతున్నారని వదంతులు వ్యాపిస్తున్న వేళ జో బైడన్ తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పందించారు. తమ పార్టీ నేతలెవరూ తనను వైదొలగమని చెప్పలేదని తేల్చిచెప్పారు. దేవుడు మాత్రమే తనను రేసు నుంచి తప్పించగలడని అన్నారు. ట్రంప్‌తో జరిగిన చర్చలో తప్పిదాలు జరిగిన మాట వాస్తవేమనని అంగీకరించారు. కానీ ఇదే చర్చలో ట్రంప్ 28 సార్లు అబద్ధాలు చెప్పారని అన్నారు. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు.