18-04-2025 01:50:53 AM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హనుమకొండ, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): హాసన్ పర్తి మండల పరిధిలోని ఎర్రగట్టుగుట్ట బాలాజీ గార్డెన్స్ నందు భూ భారతి చట్టం పై రైతుల కోసం నిర్వహించే అవగాహన సదస్సు కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ధరణి విషయమై ఒక మాటిచ్చారని, ధరణి స్థానంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులు, ప్రజలకు ఉపయోగపడే నూతన చట్టం భూ భారతిని తీసుకువచ్చారని అన్నారు. రైతులు, ప్రజల అభిప్రాయాలను తీసుకునే భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.
పైలెట్ ప్రాజెక్టు కింద హనుమకొండ జిల్లాలోని హసన్ పర్తి మండలంలో చేయడం సంతోషకరంగా ఉందన్నారు. భూమిని రైతులు, ప్రజలు ప్రాణప్రదంగా చూసుకుంటారని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ తీసుకురావడంతో గ్రామాల్లో మనశ్శాంతి లేకుండా పోయిందన్నారు. రైతుల కంట కన్నీరు పెడితే రాజ్యానికి అరిష్టమంటారని అన్నారు.
కార్యక్రమంలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవో రమేష్ రాథోడ్, ఎమ్మార్వో ప్రసాద్, ఎంపీడీవో కర్ణాకర్ రెడ్డి, ఏవో అనురాధ, హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి, హసన్ , పెగడపల్లి , వంగపహాడ్ సొసైటీల చైర్మన్లు బిల్లా ఉదయ రెడ్డి, చల్లా గోపాల్ రెడ్డి, మెరుగు రాజేష్ గౌడ్, ఆత్మకూర్ మార్కెట్ డైరెక్టర్లు రాజీవ్ గాంధీ, రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్రెడ్డి, మహిళా అధ్యక్షురాలు జోరిక పూలక్కా, డివిజన్ అధ్యక్షుడు కనుపర్తి కిరణ్, మండల, గ్రామస్థాయి, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.