26-04-2025 12:48:04 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఏప్రిల్ 25: పరిశుభ్రత విషయంలో అందరిలో మార్పు వస్తే మలేరియా అంతమవుతుందని పీహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేష్ నాయక్ అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పిలుపుమేరకు మండల కేంద్రం అర్వపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మలేరియా డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.'
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు.ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలని,దోమతెరలు వాడాలని సూచించారు. సీహెచ్‌ఓ బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, సిబ్బంది సునిత, కళమ్మ, వాణి, గౌతమి, సైదమ్మ,కుంభం వీరయ్య, నాగరాణి, గిరిజ, విజయశాంతి, శ్వేత, శైలజ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.