calender_icon.png 13 February, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఎన్డీయేకు 343

13-02-2025 01:01:28 AM

  • వెల్లడించిన ఇండియా టుడే వోటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ ఒపీనియన్ పోల్
  • ఇండియా కూటమికి కేవలం 188 సీట్లే వస్తాయని అంచనా
  • బీజేపీ సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడి
  • 2024 ఫలితాల్లో ఎన్డీయేకు 293 , ఇండియా కూటమికి 234 సీట్లు
  • ఆరు నెలల్లో అధఃపాతాళానికి ‘ఇండియా’
  • కాషాయ పార్టీకి సొంతంగానే 281 సీట్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఇండియా టుడే వోటర్ సంస్థలు నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ ఒపీనియన్ పోల్‌లో ఆశ్చర్యకర ఫలితాలు వెలుగుచూశాయి. ఇప్పటికిప్పుడు దేశ ంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీ యే కూటమికి 343 సీట్లు వచ్చే అవకాశం ఉందని, అదే సమయంలో ఇండియా కూటమికి కేవలం 188 సీట్లు మాత్రమే వస్తాయని ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది.

ప్రభుత్వ ఏర్పా టుకు కావాల్సిన 292 సీట్ల మెజార్టీని ఎన్డీయే కూటమి ఈజీగా సాధిస్తుందని సర్వే పేర్కొ ం ది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూ టమి 234 సీట్లు కైవసం చేసుకోగా.. తాజా ఒ పీనియన్ పోల్‌లో ఈ సంఖ్య 188కి పడిపోయింది. 2024 ఎన్నికల్లో 293 సీట్లు గెలుచు కున్న ఎన్డీయే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి తే 343 సీట్లు గెలుచుకుంటుందని ఒపీనియన్ పోల్ వెల్లడించింది. 

బీజేపీకి 281.. కాంగ్రెస్‌కు 78

రెండు కూటముల్లోని ప్రధాన పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్‌లు గెల్చుకునే సీట్ల సంఖ్యలో కూడా భారీ మార్పులొచ్చాయి. 2024 ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు రాగా.. తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో ఆ సంఖ్య 281కి చేరుకుంది. కాంగ్రెస్‌కు మొన్నటి ఎన్నికల్లో సొంతంగా 99 సీట్లు రాగా.. ప్రస్తు తం ఆ సంఖ్య 78కి చేరడం గమనార్హం. అంతే కాకుండా ఇరు పార్టీలు సాధించే ఓట్ షేర్ విషయంలో కూడా భారీగా తేడాలొచ్చాయి.

జనవరి 2 ఫిబ్రవరి 9 మధ్య

ఇండియా టుడే ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ పోల్ జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 మధ్య నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లోక్‌సభ సెగ్మెంట్ల నుంచి 1,25,123 మంది అభిప్రాయా లు తీసుకున్నారు. పాత డాటాను కూ డా ఈ సర్వే కోసం తీసుకున్నారు.