18-02-2025 12:43:57 AM
కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్
కామారెడ్డి, ఫిబ్రవరి 17( విజయక్రాంతి), ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయుల అధ్యాపకుల గొంతు క అవుతానని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ నియోజక వర్గ MLC ఎన్నికల్లో ఉద్యమ నేపథ్యంతో పాటు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై స్పష్టమైన అవగాహన అనుభవం ఉందని తెలిపారు
ఎస్సీ ఎస్టీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్ లు మాట్లాడుతూ సామాజిక స్పృహ కలిగిన నాయకులను శాసనమండలికి పంపినట్టయితే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని తెలియజేశారు, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డి ,టీపీటీఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు నళిని దేవి,యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు,ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంగయ్య ,tsutf ప్రధాన కార్యదర్శి ఏ. సాయిలు,బహుజన విద్యార్థి సంఘ నాయకులు విట్టల్ ,CITU నాయకులు చంద్రశేఖర్ ,SFI జిల్లా అధ్యక్షులు M. అరుణ్ కుమార్,సీనియర్ ఫెడరేషన్ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.