calender_icon.png 18 October, 2024 | 4:57 PM

దీపావళికి డీఏ లు ఇవ్వకపోతే ఇక ఉద్యమమే..

18-10-2024 02:36:01 PM

కరీంనగర్, (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన 4 డీఏ లను దీపావళి పండుగ సందర్భంగా తక్షణమే ప్రకటించాలని లేని ఎడల ఉద్యమించాల్సి వస్తుందని  తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్ర హెచ్చరించారు. ఖాద్రీ మాట్లాడుతూ.. గత సంవత్సరం 2022 జులై నుంచి 2024 జనవరి వరకు మొత్తం 4  డీఏ లు బకాయిలు ఉండగా కేంద్ర ప్రభుత్వం మరో డీఏ 3'/, ను కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుసరించిడం లేదో అర్థం కావట్లేదున్నారు. ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా పెండింగ్ లో ఉన్న 5 డీఏ లు ఇచ్చి సప్లిమెంటరీ బిల్లులు, సరెండర్, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్, లోన్లు సకాలంలో వచ్చేటట్లు వెంటనే ప్రభుత్వం స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలపైన తగు నిర్ణయాలు తీసుకోని అమలు చేయాలని అన్నారు.

గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను పెడచెవిన పెట్టిందనే విషయం ఈ ప్రభుత్వానికి బాగా తెలుసని అన్నారు. ఆ పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా వెంటనే స్పందించి తగు నిర్ణయాలు తీసుకొని ఒక నిర్దిష్ట కాలపరిమితిలో ఇచ్చేటట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలపై ద్రుష్టి సారించి సగటు ఉద్యోగికి లాభం చేకూరేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.