calender_icon.png 20 April, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి కేసులో చిక్కితే ప్రభుత్వ పథకాలు కట్...

19-04-2025 11:05:07 PM

ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్.. 

ఆదిలాబాద్ (విజయక్రాంతి): యువతకు చదువుపై ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఉన్నతంగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు. మారుమూల ఆదివాసి గ్రామాలలోని ప్రజలకు వైద్య సేవలు అందించాలని సదుద్దేశంతో జిల్లా పోలీసు యంత్రాంగం తరపున గాదిగూడ మండలంలోని కొలం గూడలో జిల్లా వైద్యశాఖ సహకారంతో ఉచిత మేగా వైద్య శిబిరాన్ని శనివారం జిల్లా ఎస్పీ, డాక్టర్లు ఆదివాసీలకు వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు గోలీలు అందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి సమాజంలో చీడపురుగు అని, గంజాయి పండించడం వల్ల, వాడడం వల్ల సమాజ శ్రేయస్సుకు నష్టం కలుగుతుందని తెలియజేశారు. గంజాయి పండించడం వల్ల ప్రభుత్వం వల్ల వచ్చే లబ్ధిని కోల్పోతారని, గంజాయి కేసులు నమోదు చేపడతాయని తెలియజేశారు. ఉట్నూరు ఎఎస్పీ కాజల్ సింగ్, నార్నూర్ సీఐ రహీం పాషా, వైద్య సిబ్బంది, గాదిగూడ ఎస్ఐ నాగనాథ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.